ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో మరోసారి గంజాయి కలకలం సృష్టించింది. విజయవాడలోని కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద సోమవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు వాహనాల్లో భారీగా గంజాయి పట్టుబడింది.సుమారు రూ.1.61 కోట్ల విలువైన 808 కేజీల గంజాయిని అధికారులు సీజ్ చేశారు. పోలీసులు గంజాయిని తరలిస్తున్న ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.