మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ ‘గాంజా శంకర్’. ఇది సాయితేజ్ నటిస్తున్న 17వ సినిమా కాగా.. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ హైను ఆదివారం మేకర్స్ లాంచ్ చేశారు.
పక్కా మాస్ షేడ్‌లో ఉన్న ఈ మోషన్ టీజర్లో సాయితేజ్‌ను మేకోవర్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా కనిపిస్తోంది. అలాగే ఇందులో భీమ్స్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. మొత్తానికి అయితే ఒక మాస్ కొలాబరేషన్లో సాలిడ్ ట్రీట్ ఇవ్వడానికి సాయితేజ్–సంపత్ నంది సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు నిర్మిస్తున్నారు.