Homeహైదరాబాద్latest Newsకిరాణా షాప్ ముసుగులో గంజాయి దందా.. మహిళ అరెస్ట్..!

కిరాణా షాప్ ముసుగులో గంజాయి దందా.. మహిళ అరెస్ట్..!

కిరాణా షాప్ లో గంజాయి విక్రయిస్తున్న మహిళను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే అనురాధ బాయి గచ్చిబౌలి కిరాణా షాపు నిర్వహిస్తోంది. ఆమె కిరాణా షాపు ముసుగులో గంజాయి దందాకు పాల్పడుతోంది. హైదరాబాద్ దూల్ పేట్ నుండి  గంజాయి తెచ్చి తెలిసిన వారికి విక్రయిస్తుంది.

విశ్వసనీయ సమాచారం మేరకు ఆమె కిరాణా షాప్ పై దాడి చేయగా 300గ్రాముల గంజాయి పట్టుబడింది.1200నగదు, మొబైల్ ఫోన్ ను యస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితురాలిని రిమాండ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img