Homeఆంధ్రప్రదేశ్గ్యాస్ లీకై మంటలు.. నలుగురికి తీవ్ర గాయాలు

గ్యాస్ లీకై మంటలు.. నలుగురికి తీవ్ర గాయాలు

– ఏపీలోని విశాఖ జిల్లాలో ఘటన

ఇదే నిజం, ఏపీ బ్యూరో: ఏపీలోని విశాఖ జిల్లా కేంద్రంలో గ్యాస్‌ సిలిండర్‌ లీకై ఒకే కుటుంబానికి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని మధురవాడ వాంబే కాలనీలో నివాసముంటున్న బాలరాజు అనే వ్యక్తి అయ్యప్పమాల ధరించాడు. శుక్రవారం వంట గ్యాస్‌ అయిపోవడంతో కొత్త సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చాడు. అయితే రెగ్యులేటర్‌ను సక్రమంగా అమర్చలేదు. గ్యాస్‌ లీకేజీ అయిన విషయం గమనించకుండా కొద్ది సేపు అనంతరం దేవుడి చిత్రపటాల వద్ద దీపారాధన చేయడానికి అగ్గి వెలిగించడంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. దీంతో బాలరాజుతో పాటు భార్య చిన్ని, కుమారులు గిరి, కార్తిక్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ నలుగురిని 108 అంబులెన్స్‌లో కింగ్‌ జార్జ్‌ ఆసుపత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img