Homeహైదరాబాద్latest Newsతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. అదానీ తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. ఈ క్రమంలో రూ.కోటి విరాళం అందించినట్లు పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీకి అదానీ ఫౌండేషన్ నుంచి 100 కోట్ల రూపాయలను చెక్కు రూపంలో అందజేశారు. సమావేశంలో అదానీ గ్రూప్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు, సీఎస్‌ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను నియమించారు.

Recent

- Advertisment -spot_img