బిగ్బాస్ తెలుగు సీజన్ 8..పదో వారం నామినేషన్లు హోరా హోరీగా జరిగాయి. అయితే ఈ వారం నామినేషన్స్ ఏడుగురు పోటీదారులు ఉన్నారు. వారిలో నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ నామినేషన్స్‌లో ఉన్నారు.ప్రస్తుతం బిగ్బాస్ హౌస్‌లో అన్ని తారు మరు అవుతున్నాయి. ఈ పదో వారం నామినేషన్స్ ప్రక్రియలో గౌతమ్ కన్నడ బ్యాచ్ ని తన మాట తీరుతో అదరగొడుతున్నాడు.
అయితే ఈ పదో వారం ఓటింగ్‌లో గౌతమ్ కృష్ణ 27 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు గౌతమ్ అత్యధిక ఓటింగ్ తో ముందంజలో ఉన్నాడు. నిఖిల్ 19.3 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఇప్పటి వరుకు విన్నర్ గా నిఖిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అందరూ అనుకున్నారు కానీ సైలెంట్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి సోలోగా ఆడుతూ గౌతమ్ కృష్ణ హౌస్ లో విన్నర్ కానున్నాడు అని తెలుస్తుంది. ఈ వారం యాంకర్ విష్ణు ప్రియ 7.4 శాతం ఓటింగ్‌తో, హరితేజ 7.86 శాతం చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ వారం హరితేజ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.