Homeహైదరాబాద్latest Newsటేస్టీ తేజ కోసం గౌతమ్ షాకింగ్ డెసిషన్..! అసలేం జరిగిందంటే..?

టేస్టీ తేజ కోసం గౌతమ్ షాకింగ్ డెసిషన్..! అసలేం జరిగిందంటే..?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 హౌసులో ఫ్యామిలీ సీజన్ మొదలైంది. ప్రస్తుతం ఈ వారంతా ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. నిన్నటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ వచ్చి వెళ్లినప్పుడు టేస్టీ తేజ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే గత వారం అతని వల్ల జరిగిన కొన్ని సంఘటనల వల్ల హౌస్ మేట్స్ లో ఎక్కువ మంది అతడ్ని వరస్ట్ కంటెస్టెంట్‌గా ఎంపిక చేసారు.వరస్ట్ కంటెస్టెంట్‌గా ఎంపికైనందున తేజ కుటుంబాన్ని ఫ్యామిలీ వీక్ రానివ్వడం లేదని నాగార్జున తెలిపారు. దీంతో టేస్టీ తేజ చాలా బాధపడ్డాడు. ఈ సీజన్‌లో బిగ్‌బాస్ హౌస్‌కి రావడానికి అసలు కారణం ఈ ఫ్యామిలీ వీక్‌లో తన తల్లిని తీసుకురావడమేనని తేజ చెప్పాడు. అయితే ఆ తరువాత తేజ ఏడుస్తూ.. దయచేసి మా అమ్మని లోపలకు పంపించండి బిగ్‌బాస్.. కావాలంటే నేను ఎలిమినేట్ అయ్యే వరకు నన్ను నామినేషన్స్‌లో పెట్టండి బిగ్‌బాస్ అని అంటాడు. అయితే తేజ బాధను అర్థం చేసుకున్న గౌతమ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. తేజ కోసం నా ఫ్యామిలీ వీక్ ని త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని బిగ్‌బాస్ కి చెప్పాడు. గత సీజన్‌లో మా అమ్మ నా కోసం వచ్చింది. అది చాలు నాకు. ఈ సీజన్‌లో కూడా కొన్ని అనివార్య ఘటనలతో తేజకి శిక్ష పడింది. దయచేసి వాళ్ళ అమ్మను లోపలికి పంపండి. నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెపుతాడు. ఈ విధంగా తేజ కోసం గౌతమ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.

Recent

- Advertisment -spot_img