Homeహైదరాబాద్latest Newsఓటిటీలోకి "గీతాంజలి మళ్లీ వచ్చింది"..!

ఓటిటీలోకి “గీతాంజలి మళ్లీ వచ్చింది”..!

శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం “గీతాంజలి మళ్ళీ వచ్చింది”. ఈ మధ్యే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. థియేటర్లలోకి ఏప్రిల్ 11న వచ్చిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాని ఇప్పుడు నెల తిరిగిసరికల్లా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఈ సినిమా మే 8వ తేదీ నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమాని 2014లో వచ్చిన ‘గీతాంజలి’ మూవీకి దీన్ని సీక్వెల్‌గా తెరకెక్కించారు. షకలక శంకర్, సునీల్, అలీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Recent

- Advertisment -spot_img