Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో ఘరానా మోసం.. మహిళను మోసం చేసి కిలో బంగారంతో ఉడాయించిన యువకుడు

హైదరాబాద్ లో ఘరానా మోసం.. మహిళను మోసం చేసి కిలో బంగారంతో ఉడాయించిన యువకుడు

పెట్టుబడి పేరుతో మహిళను యువకుడు మోసం చేశాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని పద్మారావునగర్ కు చెందిన ఓ మహిళ(56)కు తన కూతురు స్నేహితుడు కార్తీక్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో డీఎస్ఆర్ గ్రూపులో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని యువకుడు నమ్మించాడు. నమ్మిన బాధితురాలు కిలో బంగారం కార్తీక్ రెడ్డికి అప్పజెప్పింది. అప్పటి నుంచి అందుబాటులో లేకపోవడంతో మోసపోయినట్టు గ్రహించి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Recent

- Advertisment -spot_img