Homeహైదరాబాద్latest Newsఘరానా కేటుగాడు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానంటూ భారీ మోసం..!

ఘరానా కేటుగాడు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానంటూ భారీ మోసం..!

ఇదేనిజం, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజక వర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానంటూ పలువురు నిరుపేదలను భారీ మొత్తంలో మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.. బాధితుల వివరాల ప్రకారం. గచ్చిబౌలి టీఎన్జీవోస్ కాలనీకి చెందిన నాగరాజు శేరిలింగంపల్లి ఎమ్మార్వో ఆఫీస్  పనిచేస్తున్నానంటూ నమ్మించి డబుల్ ఇండ్లు వచ్చేలా చూస్తానని ఒక్కొక్కరి దగ్గర నుంచి 50 వేలు చొప్పున వసూళ్ల చేసి భారీ మోసానికి తెరలేపాడు.ఈ క్రమంలోసుమారు 22మంది వద్ద . దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయల మేర వసూళ్లు చేశారని సమాచారం. అయితే   బాధితులు పలుమార్లు నాగరాజుకు ఫోన్ చేయగా ఆఫీసులో ఉన్నాను కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నాను అంటూ బకాయిస్తున్నాడు. దీంతోమోసపోయామని బాధితులు గుర్తించారు. దీంతో సదరు వ్యక్తిపై  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు  డబ్బులు ఇచ్చిన వాళ్లంతా నిరుపేదలే.. ప్రస్తుతం నాగరాజు కోసం గచ్చిబౌలి పోలీసులు గాలిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img