Homeలైఫ్‌స్టైల్‌Ghee Benefits : నెయ్యి ఆరోగ్య లాభాలు తెలుసా..

Ghee Benefits : నెయ్యి ఆరోగ్య లాభాలు తెలుసా..

Ghee Benefits : నెయ్యి ఆరోగ్య లాభాలు తెలుసా..

Ghee Benefits : పూర్వ కాలంలో నెయ్యి వినియోగం ఎక్కువగా ఉండేది.

అప్పట్లో ఈ వాణిజ్య నూనె పంటల సాగు పెద్దగా ఉండేది కాదు.

ప్రతి ఇంటిలో పాడి ఆవులు, గేదెలు ఉండడంతో పుష్కలంగా నెయ్యి లభించేది.

దాంతో వినియోగం కూడా ఎక్కువగా ఉండేది. మరి, గతంతో పోలిస్తే నేడు నెయ్యి వినియోగం తగ్గింది.

కానీ, జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి.

కనుక నెయ్యితో ఆరోగ్యానికి నష్టం జరుగుతుందన్న అపోహలు ఉంటే తీసేయాలి.

ఆయుర్వేదంలోనూ నెయ్యిని ఔషధంగా పేర్కొన్నారు.

నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి.

ఖాళీ కడుపుతో నెయ్యిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడంతోపాటు మలబద్ధకాన్ని పోగొడుతుంది.

వృద్ధాప్య ఛాయలను ముందుగా కనపడనీయకుండా నెయ్యి మేలు చేస్తుంది.

కంటి ఆరోగ్యానికి కూడా మంచిదే. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

మరి నెయ్యితో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కరూ నెయ్యి తీసుకోవడం కుదరదని ఆయుర్వేద డాక్టర్ రేఖా రాధామణి తెలిపారు.

శరీర ధర్మానికి అనుకూలమైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందని ఆమె చెప్పారు.

ఆరోగ్యకరం అన్న ప్రతిదీ ప్రతి ఒక్కరికీ సరిపడదన్నారు.

వ్యక్తి శరీర ధర్మాన్ని ఆయుర్వేదం వాత, పిత్త, కఫ దోషాలుగా వర్గీకరించింది.

కనుక ఒకరికి ఆరోగ్యాన్నిచ్చేది, మరొకరికి విషంగా మారొచ్చని రాధామణి చెప్పారు.

నెయ్యి జీర్ణానికి మందమైనది. దీర్ఘకాలంగా, తీవ్రమైన అజీర్ణం, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్న వారు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ బాధితులు నెయ్యి తీసుకోకూడదు.

నెయ్యితో కఫం పెరుగుతుంది. కనుక జ్వరం వచ్చిన సమయంలో నెయ్యి తీసుకోకూడదు.

అలాగే, కఫ దోషం ఉన్న వారు కూడా తీసుకోకూడదు.

గర్భం దాల్చిన వారు, అప్పటికే తగినంత బరువు ఉంటే కనుక నెయ్యిని తగ్గించుకోవాలి.

లివర్ సిర్రోసిస్, హెపటైటిస్ తదితర కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలి.

Recent

- Advertisment -spot_img