Homeతెలంగాణghmc:పెండింగ్​ బిల్లులు చెల్లించండి

ghmc:పెండింగ్​ బిల్లులు చెల్లించండి

– జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద కాంట్రాక్టర్ల ఆందోళన

ఇదేనిజం, హైదరాబాద్​: హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నది. పెండింగ్​ బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బల్దియా కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. సుమారు ₹1000 కోట్ల మేర బిల్లులు చెల్లించాలని ఆందోళనకు దిగారు. బల్దియా ముట్టడికి కాంట్రాక్టర్లు, వారి కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. పోలీసులు కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలిస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img