GHMC: సంస్థల ప్రమోషన్ కోసం చెట్లకు పోస్టర్లను తగిలిస్తున్నారు. ఇలా నిబంధలను అతిక్రమించిన ఓ కన్సల్టెన్సీకి బల్దియా బల్దియా జరిమానా విధించింది.గాజుల రామారంలోని ఎల్లమ్మబండ ప్రాంతంలో సాయి కన్సల్టెన్సీ నిర్వాహకులు రహదారి పక్కన చెట్టుపై పోస్టర్ తగిలించి తమ సంస్థ కోసం ప్రచారం చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్‌ను తగిలించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం ఆ కన్సల్టెన్సీకి 6వేల రూపాయలు జరిమానా విధించింది. ఈ మేరకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. మరో ఘటనలో ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్‌లో ప్రమాదకర స్థాయిలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలిస్తున్న ఓ లారీని గుర్తించి ఆ వాహన యజమానికి ఈవీడీఎం 25వేల రూపాయల జరిమానా విధించింది.