హైదరాబాద్ నాచారంలో పార్క్ చేసి ఉన్న బైకులపైకి GHMC క్లీనింగ్ వాహనం దూసుకెళ్ళింది. GHMC వాహనాన్ని రోడ్డుపై ఆపి డ్రైవర్ కిందికి దిగాడు. డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వాహనం ముందుకు కదిలింది. పార్క్ చేసి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. తరువాత వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నం చేసిన క్రమంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడ జనం లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.