Homeహైదరాబాద్రూల్స్ పట్టని సుజనా ఫోరమ్ మాల్​.. తాజాగా రూ.4లక్షల ఫైన్​

రూల్స్ పట్టని సుజనా ఫోరమ్ మాల్​.. తాజాగా రూ.4లక్షల ఫైన్​

హైదరాబాద్: నగరంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులపై జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) స్పెషల్ డ్రైవ్‌ కొనసాగుతోంది. కూకట్‌పల్లిలోని ఫోరమ్ సుజనా మాల్‌కు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తాజాగా 4 లక్షల జరిమానా విధించారు. గతంలోనూ అనేక సార్లు ఫైన్​లు వేసినా మాల్​ తీరు మారడం లేదని అధికారులు చెప్పారు. దీంతో సుజనా మాల్స్‌కు ఇప్పటి వరకు 16 లక్షల 50వేల జరిమానా విధించినట్లు జీహెచ్​ఎంసీ అధికారులు వెల్లడించారు. అలాగే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌కు రూ. 2 లక్షలు, బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు రూ.2 లక్షల జరిమానా విధించారు.

Recent

- Advertisment -spot_img