ఇదే నిజం దేవరకొండ: డిండి మండలం స్థానిక తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల మరియు కళాశాల కు నిన్న కొండమల్లేపల్లి మండలం కోలుమంతలపాడు గ్రామానికి చెందిన రవి తన వంతు సహాయంగా పాఠశాలకు 10,000 రూపాయల విలువ చేసే ఆట వస్తువులను బహుకరణ చేయడం జరిగింది. రవి మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడలు మానసికొల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కర్ణాకర్ రెడ్డి, అంజయ్య, రఘు నందన్, పిడి రవి అధ్యాపక బృందం పాల్గొన్నారు.