Homeసినిమాఅభిమానులకు పవన్​ పుట్టినరోజు కానుక...

అభిమానులకు పవన్​ పుట్టినరోజు కానుక…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సెప్టెంబర్ 2 రానే వచ్చేసింది. రేపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ అభిమానులు ఆయనకు భారీ స్థాయిలో విషెస్ అంధించాలని రెడీ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో కూడా సరికొత్తగా రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు. ఇక ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ పై కూడా అప్పుడే అంచనాల డోస్ పెరిగింది.

సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి కూడా పోస్టర్, ఒక సాంగ్ తప్పితే మరో అప్డేట్ లేదు. దాదాపు షూటింగ్ ఏండింగ్ లోకి వచ్చేసింది. ఇక థియేటర్స్ ఓపెన్ అయిన తరువాతనే సినిమా ప్రమోషన్స్ డోస్ పెంచుకోవాలని అనుకున్నారు. కానీ బర్త్ డే ఉండడంతో అభిమానుల కోసం ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

ఇక రేపు 9:09గంటలకు వకీల్ సాబ్ కి సంబంధించిన ఒక స్పెషల్ ట్రీట్ రానున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు ఈ న్యూస్ ఒక మంచి కిక్కిచ్చింది. దీంతో ఎలాంటి అప్డేట్ ఇస్తారో అనే విషయంపై అంచనాలు మొదలయ్యాయి. టీజర్ లాంటిది ఏదైనా రిలీజ్ చేయవచ్చని టాక్ వస్తోంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img