నటి అంజలి హీరోయిన్గా 2014లో వచ్చిన హర్రర్ కామెడీ థ్రిల్లర్ గీతాంజలి. రచయిత కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మూవీకి సీక్వెల్‌గా తీసిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు కూడా బాగానే నవ్వించిందని ఆడియెన్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. కథలో బలమైన ఎమోషన్స్ ఎక్కడా లేనప్పటికీ ఫుల్ ఔట్ అండ్ ఔట్ కామెడీ, హార్రర్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉందని.. అక్కడక్కడా భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించినట్లు నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. దీంతో గీతాంజలి సీక్వెల్ కూడా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తోందని క్రిటిక్స్ చెబుతున్నారు.