– హైకోర్టులో ఎమ్మెల్యే సీతక్క పిటిషన్
ఇదే నిజం, హైదరాబాద్: ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేశారు. నిధుల మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నందున తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని.. సీడీఎఫ్ నిధుల మంజూరులో జిల్లా మంత్రి ప్రమేయం చట్ట విరుద్ధమన్నారు. జిల్లా మంత్రి ఆమోదంతో నిధులు మంజూరు చేయాలన్న జీవోను కొట్టేయాలని హైకోర్టుకు సీతక్క విజ్ఞప్తి చేశారు. సీతక్క పిటిషన్‌పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 9కి వాయిదా వేసింది..