Homeజిల్లా వార్తలు‘ఇనగాలకు ఎమ్మెల్సీ ఇవ్వండి’

‘ఇనగాలకు ఎమ్మెల్సీ ఇవ్వండి’

ఇదే నిజం, ఆత్మకూరు: కాంగ్రెస్​ పరకాల ఇన్​ చార్జ్​ ఇనగాల వెంకట్రాంరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఆత్మకూరు మండల కిసాన్​ సెల్​ అధ్యక్షుడు రేవూరి జయపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వెంకట్రామ్ రెడ్డి దశాబ్ద కాలంగా నియోజకవర్గంలో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్​ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, నాయకుడు అలువాల రవి పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img