Homeరాజకీయాలుడబల్ ఇంజిన్ సర్కారుకు ఓ చాన్స్ ఇవ్వండి

డబల్ ఇంజిన్ సర్కారుకు ఓ చాన్స్ ఇవ్వండి

  • కేసీఆర్ అవినీతి వల్ల తెలంగాణ దివాలా
  • మాకు పవర్ ఇవ్వండి బీసీని సీఎం చేస్తాం
  • సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తాం
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఇదేనిజం, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారుకు ఓ చాన్స్ ఇవ్వాలని కేంద్రహోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ దివాలా తీయించారని అమిత్ షా ఆరోపించారు. శనివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం ఇస్తే బీసీని సీఎం చేస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం 1200 మంది బలిదానంతో ఏర్పడితే.. ఈ పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతి తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. ‘ఉద్యోగాలు భర్తీ చేయలేదు. లక్ష రుణమాఫీ చేయలేదు. నిరుద్యోగ భృతికి యువత నోచుకోలేదు. కేజీ టూ పీజీ ఉచిత విద్య గాలికి వదిలేశారు. ప్రతీ జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి హామీ నెరవేరలేదు. గ్రానైట్‌ కుంభకోణంలో వందల కోట్ల అవినీతి జరిగింది. సెప్టెంబర్‌ 17 నిర్వహణపై మాట ఇచ్చి తప్పారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణలో పేదలు, రైతులు, విద్యార్థులు నిరాశలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మార్చాలని బలంగా అనుకుంటున్నారు.’ అంటూ విమర్శించారు.

Recent

- Advertisment -spot_img