ఇదే నిజం, కుత్బుల్లాపూర్: జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ 53వ బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు జగద్గిరిగుట్ట డివిజన్ కార్పోరేటర్ కొలుకుల జగన్ కుటుంబ సమేతంగా పాల్గొని అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవార్ల అలంకరణకు కార్పోరేటర్ కొలుకుల జగన్ 1.50 కీలోల వెండిని ఆలయ ఈఓకు విరాళంగా అందజేశారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బండి సత్యనారాయణ, లక్ష్మీ, కొలుకుల శశికళ జగన్, యూత్ నాయకులు కొలుకుల జైహింద్, జ్యోతి, శివాని, సాయి, కార్తిక్, కీర్తి, తదితరులు పాల్గొన్నారు