Homeహైదరాబాద్latest Newsచేవెళ్ల ఎంపీ సీటు కాసాని జ్ఞానేశ్వర్​కు?

చేవెళ్ల ఎంపీ సీటు కాసాని జ్ఞానేశ్వర్​కు?

– ముఖ్యనేతలతో కేసీఆర్​ సమావేశం
– పోటీ చేయనన్న సిట్టింగ్​ ఎంపీ రంజిత్​ రెడ్డి
– బీసీ నేతకు ఇవ్వాలని గులాబీ బాస్​ నిర్ణయం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: చేవెళ్ల ఎంపీ సీటు కాసాని జ్ఞానేశ్వర్​కు ఇవ్వాలని బీఆర్ఎస్​ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ముఖ్యనేతలో బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ సోమవారం నందినగర్​ లోని తన ఇంట్లో సమావేశమయ్యారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణ‌, బీఆర్ఎస్ లోక్‌స‌భ అభ్య‌ర్థిపై స‌మావేశంలో చ‌ర్చిస్తున్నారు. ఈ స‌మావేశానికి మాజీ మంత్రి, మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్ర‌కాశ్ గౌడ్, ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి, మాజీ ఎమ్మెల్యేలు పైల‌ట్ రోహిత్ రెడ్డి, మెతుకు ఆనంద్, మ‌హేశ్వ‌ర్ రెడ్డి, సీనియ‌ర్ నాయ‌కులు కాసాని జ్ఞానేశ్వ‌ర్, స‌బితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డితో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు.

భువనగిరి, నల్లగొండ సీట్లపై కూడా సమీక్ష

చేవేళ్లతో పాటు నల్గొండ జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల (భువనగిరి, నల్గొండ) ఎన్నికల కార్యాచరణపై పార్టీ అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. కొన్ని వ్యక్తిగత, ఇతర కారణాల రీత్యా రంజిత్‌రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ఆయన ఎక్కడికీ వెళ్లారని పార్టీలోనే కొనసాగుతారని కేసీఆర్ నేతలకు వివరించినట్లు తెలిసింది. లోక్‌సభ టికెట్ ఆశించి, ఆ తర్వాత వెనక్కి తగ్గిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల సమావేశానికి హాజరు కాలేదు. ఆశావహ అభ్యర్థులకు సంబంధించి కేసీఆర్‌ ఆరా తీశారు.

Recent

- Advertisment -spot_img