HomeతెలంగాణGod Made Ganapati idle : స్వయంభుగా వెలసిన ఏకాశిల గణపతి

God Made Ganapati idle : స్వయంభుగా వెలసిన ఏకాశిల గణపతి

  • కాణిపాకం వరసిద్ధివినాయకుడితో దగ్గరిపోలికలు
  • అతిపురాతనమైనదిగా గుర్తింపు
  • 5 అడుగుల ఏకాశిలపై చెక్కిన వినాయకుడు
  • ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న గ్రామస్థులు
  • దేవాలయాన్ని నిర్మించాలని డిమాండ్

God Made Ganapati idle : మనం ఏ పని చేయాలి అనుకున్నా ఎలాంటి విజ్ఞాలు కలగకుండా ఉండడానికి వినాయకుడికి తొలి పూజ చేయడం ఆనవాయితీ. పనులకు అవరోధాలు కలగకుండా ఆ గణనాథుడు చేస్తాడని భక్తుల నమ్మకం.

https://www.facebook.com/idenijam247/
https://www.facebook.com/idenijam247/

{మా ఫేస్​బుక్​ పేజీ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి}

గణేష్ చతుర్థి సందర్భంగా నవరాత్రులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలకేంద్రంలోని బొడగుట్ట, మావిల్లచెరువు సమీపంలో వెంకటేశ్వర చెలక లో దాదాపు 5 అడుగుల ఏకాశిలపై స్వయంభుగా వెలసిన గణనాధుడు దర్శనమిస్తున్నారు.

ఈ గణనాధుడు కోరిన కోర్కెలు తీరుస్తాడాని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల నమ్మకంతో పూజలు నిర్వహిస్తారు.

https://www.facebook.com/idenijam247/
https://www.facebook.com/idenijam247/

{మా ఫేస్​బుక్​ పేజీ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి}

కరోన కారణంగా గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన చాలావరకు తగ్గింది. ధీంతో చుట్టుప్రక్కల గ్రామస్థులు కూడా ఈ అతిపురాతనమైన స్వయంభూ గణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఇక్కడ పూర్వకాలంలో చీమలమ్మపాడు అనే గ్రామం ఉండేదని కొన్ని కుటుంబాలు అక్కడ నివసించేవి కూడా.

కాలక్రమంలో అక్కడి కుటుంబాలన్నీ తలొదిక్కుగా వలస వెళ్లిపోవడంతో అసలు ఆ ఊరు అనేది లేకుండా పోయింది. ఇప్పుడు అక్కడ మనుషులు లేరు కానీ ఆ ఊరు ఆనవాళ్ళు ఉన్నవి.

అక్కడే స్వయంభుగా వెలసిన గణనాధుడు ఏకాశిలపై దర్శనమిస్తున్నాడు.

అతిపురాతనమైన ఈ గణనాధుడు గతంలో దేదీప్యమానంగా విలసిల్లిన అనవాళ్లుండడంతో భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు.

దేవాలయం నిర్మించి అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.

https://www.facebook.com/idenijam247/

Recent

- Advertisment -spot_img