Homeజిల్లా వార్తలుపెరుగుతున్న గోదావరి వరద ఉధృతి.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

ఇదే నిజం, కుకునూరు: భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం 12.00 గంటలకు 42.70 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. గోదావరి ముంపుప్రాంతం, లోతట్టు ప్రాంతాల ప్రజలు అపప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పీ.ధాత్రి రెడ్డి విజ్ఞప్తి చేశారు. కుక్కునూరు మండలం గొమ్ముగూడెం గ్రామం లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి పునరావాస కేంద్రానికి రావాలని జాయింట్ కలెక్టర్ కోరారు. నెమలిపేట అర్ అండ్ అర్ కాలనీ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కూడా జాయింట్ కలెక్టర్ సందర్శించారు. అలాగే సీజనల్ వ్యాధులపై అప్రపతంగా వుండాలి…వైద్య శిబిరంలో అందుబాటులో వున్న మందులను పరివేక్షించారు.

Recent

- Advertisment -spot_img