Homeహైదరాబాద్latest Newsదసరా సెలవులలో ఊళ్ళల్లోకి వెళుతున్నారా..? జాగ్రత్త..!

దసరా సెలవులలో ఊళ్ళల్లోకి వెళుతున్నారా..? జాగ్రత్త..!

ఇదే నిజం, గొల్లపల్లి : బతుకమ్మ/ దసరా పండుగల రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు, దొంగతనాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు బంగారం దొంగల బారిన పడకుండా తగు జాగ్రత్తలు వహించాలి. దొంగతనాల నివారణకు ఈ కింది జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గొల్లపల్లి ఎస్సై చిర్ర సతీష్ తెలిపారు.

  1. డబ్బు మరియు విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచి వెళ్ళకూడదు.
  2. రాత్రివేళ అనుమానంగా సంచరించేవారి గురించి పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి.
  3. తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికినట్లు కనిపిస్తే అప్రమత్తం కావాలి.
  4. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి మోసపోవద్దు. ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం మంచిది.
  5. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని వచ్చేలా చూసుకోవాలన్నారు.
  6. పక్కింటి వారిద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
  7. ఇంట్లో కుటుంబసభ్యులు బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న మహిళలు, వృద్దుల వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని, ఏమరుపాటుగా ఉండవద్దు.
  8. ఖరీదైన వస్తువులను బ్యాంక్‌ లాకర్‌లో పెట్టుకోవాలి.
  9. CCTV కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
  10. కొత్తవారి కదలికలపై, అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలి.
  11. చుట్టు పక్కల వారి సెల్‌ఫోన్‌ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి.
  12. బయటికేల్లేటప్పుడు తాళలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  13. గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.

సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా వుండాలి

  • అలాగే బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా పెద్ద పెద్ద కంపెనీలు మంచి మంచి ఆఫర్లు ఇచ్చినందున ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు డూప్లికేట్ ఐడి క్రియేట్ చేసి ప్రజలను మోసం చేసే అవకాశం ఉన్నందున, ఆన్లైన్ షాపింగ్ చేసేవారు మోసపోయి విలువైన డబ్బులు పోగొట్టుకోవద్దు.
  • అవసరం లేకుండా వచ్చే మెసేజ్ లల్లో బ్లూ కలర్ లింకులను ఓపెన్ చేయవద్దు.
  • లాటరీ తగిలిందని, ఏదో గిఫ్ట్ వచ్చిందని, కారు వచ్చిందని, బైక్ వచ్చిందని, డబ్బులు వచ్చాయని, విలువైన వస్తువులు తక్కువ ధరకు ఇస్తామని, వచ్చే లింకులను నమ్మవద్దు వచ్చే మెసేజ్లను నమ్మవద్దు నమ్మి మోసపోవద్దు. సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా వుండాలి. సైబర్ నేరానికి గురైన వారు వెంటనే 1930 కి కాల్ చేయాలి.
spot_img

Recent

- Advertisment -spot_img