Golconda Blue diamond : గోల్కొండ హైదరాబాద్ సమీపంలో ఉన్న చారిత్రాత్మక ప్రాంతం, ప్రపంచంలోని అత్యంత విలువైన డైమండ్స్‌కు మూలం. అయితే గోల్కొండ గనుల్లో దొరికిన అరుదైన రాయల్ డైమండ్‌ను మే 14న జెనీవాలో వేలం వేయనున్నారు. నీలిరంగులో మెరిసే ‘ది డైమండ్ బ్లూ’ అనే వజ్రం భారతీయ రాజ వైభవానికి ప్రతీక. గోల్కొండ వజ్రాల గనుల నుండి వెలికితీసిన 23.24 క్యారెట్ల వజ్రం విలువ దాదాపు రూ. 300 నుండి రూ. 430 కోట్లు ఉంటుందని అంచనా. ఈ వజ్రం ఒకప్పుడు ఇండోర్ మహారాజుకు చెందినదని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ చీఫ్ రాహుల్ కడాకియా తెలిపారు.