Homeఫ్లాష్ ఫ్లాష్Gold Price down : జూన్ కనిష్టానికి పడిపోయిన బంగారం ధరలు..

Gold Price down : జూన్ కనిష్టానికి పడిపోయిన బంగారం ధరలు..

Gold Price down after June : జూన్ కనిష్టానికి పడిపోయిన బంగారం ధరలు.. బంగారం ధరలు బుధవారం (సెప్టెంబర్ 29) దాదాపు స్థిరంగా ఉన్నాయి. నిన్న దాదాపు రూ.200 క్షీణించిన అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు అతి స్వల్ప పెరుగుదలతో లేదా దాదాపు స్థిరంగా ఉంది. 

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.13.00 (0.03%) లాభపడి రూ.45866.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.00 (-0.00%) క్షీణించి రూ.45954.00 వద్ద ట్రేడ్ అయింది.

ఎంసీఎక్స్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.57 పెరిగి రూ.60521.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ 57.00 (0.09%) పెరిగి రూ.60521.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 1.25 (+0.07%) డాలర్లు పెరిగి 1,738.75 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.012 (-0.05%) డాలర్లు క్షీణించి 22.455 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఇటీవల రూ.46,000కు దిగువనే ఉంటోంది.

కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1740 డాలర్ల దిగువనే ఉంది.

జూన్ కనిష్టం వద్ద

బంగారం ధరలు ప్రస్తుతం జూన్ ధర కనిష్టం వద్ద ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర జూన్‌లో రూ.45,740 వద్ద ఉంది.

జూలైలో రూ.46,190వద్ద, ఆగస్ట్ నెలలో రూ.45,280 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు ఇటీవల ఊగిసలాటలో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం, డాలర్ మారకం వ్యాల్యూ, ఆర్థిక రికవరీ వంటి అంశాలు బంగారం పైన ప్రభావం చూపుతున్నాయి.

గతవారం చైనాకు చెందిన ఎవర్ గ్రాండ్ అంశం వెలుగుచూసినప్పుడు ఆర్థిక సంక్షోభం భయాలతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపారు.

ఈ అంశం చల్లబడిన తర్వాత బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.

గతవారం బంగారం ధరలు దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) రూ.46,000కు దిగువన ప్రారంభమై, ఆ తర్వాత పెరిగినప్పటికీ, చివరలో మళ్లీ తగ్గి, అదే స్థాయిలో ముగిశాయి. ఈ వారంలోను రూ.46,000 స్థాయిలోనే ఉంది.

1750 డాలర్లకు చేరుకోవచ్చు

బంగారం ధర క్రితం సెషన్‌లో 1740 డాలర్ల దిగువకు పడిపోయింది. నేటి సెషన్‌లో స్వల్ప రికవరీ కనిపిస్తోంది.

అమెరికా డాలర్ బలపడటంతో బంగారం 1732 డాలర్ల స్థాయికి కూడా పతనమైంది. కామెక్స్‌లో బంగారం నేడు 1733 డాలర్ల వద్ద ప్రారంభమైంది.

1740 డాలర్లకు పైకి చేరుకోలేదు. ఎక్కువగా1740 డాలర్ల దిగువనే ట్రేడ్ అయింది.

1728 డాలర్ల దిగువకు చేరుకుంటే మరికొంత పడిపోవచ్చునని, లేదంటే 1750 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని గ్లోబల్ బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వివిధ నగరాల్లో ధరలు

  • ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,030.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,340.
  • చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,540.
  • బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,190.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,190.
  • కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,190.
  • పుణేలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,470.
  • అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,370.
  • జైపూర్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,090.
  • లక్నోలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,990.
  • పాట్నాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,470.
  • నాగపూర్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,030.

Recent

- Advertisment -spot_img