బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు వచ్చాయనే చెప్పాలి. తగ్గినట్టే తగ్గి గోల్డ్ రేట్స్ మళ్ళీ పెరిగాయి. బంగారం కొనాలనుకునే వారికి మరోసారి షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు పెరిగి రూ.80,500 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.110 కు పెరిగి రూ.87,820 కు చేరుకుంది. ఇక వెండి ధరలు రూ.100 తగ్గి కిలో రూ. 1,08,000గా ఉంది. బంగారం కొనాలనుకునే వారు మరికొన్ని రోజులు ఓపికగా ఉండి వేచి ఉంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. అతి త్వరలోనే ఈ ధరలు భారీగా తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.