Today Gold Rate: బంగారం కొనాలనుకునే వారికి బిగ్ షాక్ తగిలింది. బంగారం ధరలు తిరిగి పుంజుకున్నాయి. తగ్గినట్టే తగ్గి గోల్డ్ రేట్స్ ఇవాళ మళ్ళీ పెరిగాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 200 పెరిగి.. రూ. 83,600 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 220 పెరగడంతో.. రూ. 91,200 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 1,000 పెరిగి.. రూ.1,13,000 గా కొనసాగుతుంది.