Homeహైదరాబాద్latest NewsGold prices : తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Gold prices : తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Gold prices : పండుగలు, శుభ కార్యక్రమాలు మరియు వివాహాల విషయానికి వస్తే, ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం. కానీ గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఊహించని ఎత్తులకు చేరుకున్నాయి. అంతర్జాతీయ డిమాండ్ కారణంగా దేశీయంగా రికార్డు స్థాయిలో ధరలు నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.92,150కి చేరుకుంది. అయితే, బంగారం ధర రూ.99 వేల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగి ప్రజలను షాక్‌కు గురిచేస్తున్నాయి. కిలో వెండి ధర రూ. 1.03 లక్షలు. గత ఏడాది బంగారం, వెండి ధరలు 37 శాతం పెరిగాయి, గత నెలలో బంగారం 6.70 శాతం, వెండి 8.80 శాతం పెరగడం గమనార్హం.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.92,400 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ. 84,000 ధర పలుకుతుంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.89,630 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ. 82,600 పలుకుతుంది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.90,870 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ. 83,600 పలుకుతుంది.

వెండి అయితే హైదరాబాద్‌లో కిలో వెండి శనివారం రూ.1,03,950 ఉండగా ఈరోజుకి ధర కాస్త తగ్గింది. మార్చి 30న కిలో వెండి ధర రూ.1,02,684 వద్ద స్థిరంగా ఉంది. విజయవాడలో పెరిగింది. అక్కడ కిలో వెండి శనివారం రూ.1,02,100 ఉండగా ఈ రోజు రూ.1,03,200 పలుకుతోంది. విశాఖపట్నంలో శనివారం కిలో వెండి ధర రూ.1,05,000 ఉండగా.. ఆదివారం నాటికి ఇంకాస్త పెరిగి రూ.1,08,000కి చేరుకుంది.

Recent

- Advertisment -spot_img