దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 350 తగ్గి రూ.66,250కు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.72,270గా ఉంది. కేజీ వెండి ధర కూడా రూ.400 తగ్గి.. రూ.86,000గా ఉంది.