వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండోరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరగ్గా.. 24 క్యారెట్లపై రూ.220 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850గా ఉండగా..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,930 వద్ద కొనసాగుతోంది. తాజాగా వెండి ధర రూ. 500 పడిపోయి కిలోకు రూ. 91,500 వద్ద ఉంది.