బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.870 పెరిగి రూ.74,620 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.68,400కు చేరింది. వెండి ధర విషయానికొస్తే.. KG వెండి ధర ఏకంగా రూ.4,000 పెరిగి రూ.96,500కు చేరింది. త్వరలోనే కేజీ సిల్వర్ రేటు రూ. లక్ష పలికే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.