బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.330 పెరిగి రూ.73,750కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.300 పెరిగి రూ.67,600గా నమోదైంది. ఇక వెండి ధరలు ఇవాళ ఆల్టైమ్ రికార్డుకు చేరాయి. కేజీ వెండి ధర రూ.2,500 పెరిగి రూ.1,00,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.