Gold Rates : భారతదేశంలో గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు అకస్మాత్తుగా పడిపోయాయి. బుధవారం బంగారం ధరలు బాగా తగ్గాయి. ఒకే రోజు బంగారం ధర దాదాపు రూ. 3 వేలు తగ్గింది. లైవ్ మార్కెట్లో బంగారం దాదాపు రూ. 99,000 ట్రేడవుతోంది.
హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2750 తగ్గుదలతో రూ. 90,150గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 3000 రూపాయల తగ్గుదలతో రూ. 98,350గా ఉంది. వెండి ధర కిలోకు రూ. 1,11,000గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,350గా ఉంది. వెండి ధర కిలోకు రూ.1,11,000గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,500 10 గ్రాములు, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,300 ఉంది.ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 గ్రాములకు 98,350 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 90,150 రూపాయలగా ఉంది.కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 98,350 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 90,150 రూపాయలు.చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 98,350 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 90,150 రూపాయలగా ఉంది.