పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. పసిడి ధరలు రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రా బంగారంపై రూ.220 పెరగ్గా.. నేడు రూ.330 పెరిగింది. దీంతో ఈ రెండు రోజుల్లో రూ.550 పెరిగింది. శుక్రవారం (జులై 12) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10గ్రా బంగారం ధర రూ.67,600గా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రా బంగారం ధర రూ.73,750గా ఉంది. మరోవైపు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.95,500గా నమోదైంది.