ఇదే నిజం, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి (Gollapalli) మండలంలోని రాఘవపట్నం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశానుసారం కాంగ్రెస్ మోసపూరిత హామీలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోస్కుల జలంధర్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గోస్కుల జలంధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకునీ ఇప్పటికీ కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని హామీల హామలు లో విఫలమైన అసమర్థ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీలు నెరవేర్చే బుద్ధి రావాలని రాఘవపట్నం గ్రామం లో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నక్క శంకరయ్య, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, సింగల్ విండో అధ్యక్షుడు మాధవరావు, మాజీ అధ్యక్షుడు బొల్లం రమేష్, మాజీ సర్పంచులు రాగం శంకరయ్య, నల్ల శ్యామ్, బలభక్తుల కిషన్, గోలి గంగారెడ్డి, రాజు కుమార్, కచ్చు కొమురయ్య, సిద్దెంకీ మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి మధుకర్ రెడ్డి నాయకులు బుర్ర తిరుపతి గౌడ్, కూన రాజేందర్, ఒడ్నాల అంజన్న, పుట్టపాక సత్యం, ఎడమల మల్లారెడ్డి, తోట్ల లక్ష్మి రాజం, కడమండ వెంకటి, వీరస్వామి, మ్యదరి రమేష్, కలకోట సత్యం, కాసాని గంగాధర్, బూస లింగయ్య, శ్రీపతుల శంకరయ్య,సిరవేని రవి, మతలపురం సాయిలు తదితరులు పాల్గొన్నారు.