Homeజిల్లా వార్తలుGollapalli : ఓటు నీదే కావచ్చు కానీ అది మనదేశ భవిష్యత్తు : మాజీ ఎంపీటీసీ...

Gollapalli : ఓటు నీదే కావచ్చు కానీ అది మనదేశ భవిష్యత్తు : మాజీ ఎంపీటీసీ సభ్యులు గోవిందుల లావణ్య జలపతి

ఇదే నిజం, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి (Gollapalli ) మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా గోవిందుల జలపతి మాట్లాడుతూ ఓటు ను అమ్ముకోవడం అంటే మన దేశ బావిషత్తును తాకట్టు పెట్టడమే.76 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో ఇంకా పేదరికంలో మగ్గుతున్నామంటే దానికి కారణం మన ఓటు హక్కును మనము సరిగా వినియోగించుకోక పోవడం వలనే ఇంకా పేదరికంలో ఉన్నాము అని అన్నారు. మహా కవి కాళోజి గారు అన్నట్టు నాయకుడు ఏపార్టీ వాడో కాదు, ఏ పాటి వాడో అని గుర్తించి ఓటు హక్కు వియోగించుకోవాలి అని తెలిపారు. కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా మరియు నాయకులు చెప్పే ప్రలోభాలకు లొంగకుండా గ్రామ స్థాయి నుండే దేశ అభివృద్ధిని కాంక్షించే నాయకులను ఎన్నుకోవాలని గ్రామస్తులకు చూచించారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ లు స్వప్న, తిరుమల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూర్ణ చందర్, ఉపాధ్యాయులు రమేష్, రుహినా, దుర్గాదేవి, గాయిత్రి శ్రీలత, గ్రామస్తులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img