ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి (Gollapally) మండల కేంద్రంలోని ఓరగంటి భార్గవ రామ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 29వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఓరగంటి భార్గవి రామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహనీయుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్థంతి సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు.
పేద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని 2రూపాయలకే 1కిలో బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపిన నాయకులు సర్గీయ నందమూరి రామారావు అని అన్నారు.పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసిన నాయకుడు ఎన్టీరామారావు అని అన్నారు.మరణం లేని మహానేత, యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అన్నారు. సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్ళు’అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాదని.. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఓరగంటి భార్గవ రామ్,రాగల్ల శంకర్,నల్ల మాన్నిఖ్యం,సాన స్వామి,సందేవేని చిన్న రాజయ యాదవ్,మొదాం లక్ష్మి రాజం,కొప్పుల స్వామి,కందుకూరి తిరుపతి,తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.