ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి రజక సంఘం పట్టణ అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో కలకోట సత్యం, నేరెళ్ల మహేష్ పాల్గొనడం జరిగింది. రజక సంఘం పట్టణాధ్యక్షులు ఎన్నికల్లో కలకోట సత్యం విజయం సాధించడం జరిగింది. రజక సంఘం పట్టణ అధ్యక్షుల కాలపరిమితి 2సంవత్సరాలు వరకు కొనసాగుతుంది. రజక సంఘం పట్టణ అధ్యక్షులు కలకోట సత్యం మాట్లాడుతూ.. రజక సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, కుల సభ్యులందరికీ అందుబాటులో ఉంటానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలకోట సత్యం, శాతాల లక్ష్మణ్, కట్కూరి రాములు, శాతాల రామయ్య, సాతాల సత్యనారాయణ, రామడుగు రఘుపతి, రామడుగు తిరుపతి, ఓడ్నాల ఉమేష్, ఓడ్నాల రాజేష్, కలకోట రాజేందర్, కలకోట వెంకటేష్, ఓగులాపురం నరసయ్య, తాడూరి సంజయ్, శాతాల సంజయ్, శాతాల మహేష్ కారబార్, శాతాల అంజి, తదితరులు పాల్గొన్నారు.