తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ దాదాపు 2000 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఇందులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీనగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే శుక్ర, శని, ఆదివారాల్లో నడిచే 450 బస్సులకు ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా TSRTC బస్సులను నడుపుతుంది.