Homeహైదరాబాద్latest Newsగుడ్​ న్యూస్​.. కరెంటు బిల్లులు ఇక కట్టాల్సిన అవసరం లేదు.. ఏ నెల నుంచి అంటే..

గుడ్​ న్యూస్​.. కరెంటు బిల్లులు ఇక కట్టాల్సిన అవసరం లేదు.. ఏ నెల నుంచి అంటే..

ఇదేనిజం, హైదరాబాద్: కాంగ్రెస్​ పార్టీ ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ అందజేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తైనా ఇంకా ఉచిత విద్యుత్​ హామీ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కరెంటు బిల్లులు సోనియాగాంధీకి పంపించండి అంటూ కేటీఆర్​ సూచించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఉచిత విద్యుత్​ హామీపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మంగళవారం గాంధీభవన్​ లో మెనిఫెస్టో కమిటీ భేటీ అయ్యింది. మంత్రులు శ్రీధర్​ బాబు, కాంగ్రెస్​ పార్టీ వ్యవహారాల ఇన్​ చార్జ్​ దీప్​ దాస్​ మున్షి సమావేశమయ్యారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్​ వరకు ఉచిత విద్యుత్ హామీ అమలు చేస్తామని ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img