ఆధార్ కార్డును పదేళ్లుగా అప్డేట్ చేసుకోని వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఈనెల 14న ముగియనుండటంతో గడువును పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి రుసుము లేకుండా డిసెంబర్ 14 లోపు ఆధార్ ను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. గడువు తర్వాత రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం ఆధార్ సేవా కేంద్రం లేదా https://myaadhaar.uidai.gov.in ఈ లింక్ ద్వారా తమ ఆధార్ను అప్డేట్ చేసుకోవచ్చు.