Homeహైదరాబాద్latest Newsఏపీ రైతులకు శుభవార్త.. వాట్సాప్‌ ద్వారా ధాన్యం కొనుగోలుకు సిద్ధం..!

ఏపీ రైతులకు శుభవార్త.. వాట్సాప్‌ ద్వారా ధాన్యం కొనుగోలుకు సిద్ధం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీతో రైతులకు కొత్త ప్రయోజనం కలిపిస్తుంది. ఈ మధ్య కాలంలో రైతులకు ధాన్యం విక్రయించడంలో చాలా ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త కాన్సెప్ట్‌ను అమలులోకి తీసుకువచ్చింది. వాట్సాప్‌లో HI చెబితే ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి శ్రమ లేకుండా రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. వాట్సాప్ నుండి 73373 59375 నంబర్‌కు HI చెబితే, అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. ఏ కేంద్రం, ఏ రోజు, ఏ సమయంలో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు విక్రయిస్తారు అనే సందేశం పంపిన వెంటనే స్లాట్ బుక్ చేయబడుతుంది. కూపన్ కోడ్ వెంటనే జనరేట్ అవుతుంది. దాని ప్రకారం రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. ప్రస్తుతం రైతులు ధాన్యం విక్రయించేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఇప్పుడు అందుబాటులోకి తెచ్చిన కొత్త సిస్టమ్‌తో వాట్సాప్ యాప్ ద్వారా ఒక్క క్లిక్‌తో ధాన్యాన్ని విక్రయించుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉంటే.. అలాంటి చోట్ల విక్రయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించింది.

Recent

- Advertisment -spot_img