ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు సర్కార్ శుభవార్త అందించింది. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే అసెంబ్లీ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.అధికారంలోకి వచ్చిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని పేర్కొన్నారు.