ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు శుభవార్త.. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వైద్య కళాశాలలకు భారీగా నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీలో 1,835 కొత్త వైద్య చికిత్సలను చేర్చినట్లు తెలిపారు. దీనితో 90 లక్షల పేద కుటుంబాలు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రయోజనం పొందుతాయని, ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ఖర్చును 20 శాతం పెంచామని భట్టి తెలిపారు.