బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. UPI (Unified Payments Interface) ద్వారా క్యాష్ డిపాజిట్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ‘ప్రస్తుతం క్యాష్ డిపాజిట్ మెషీన్లలో డెబిట్ కార్డు ద్వారా మాత్రమే డబ్బులు డిపాజిట్ చేసే సౌకర్యం ఉంది. కార్డ్ లెస్ లావాదేవీ మాదిరిగా భవిష్యత్తులో UPI ద్వారా నగదు డిపాజిట్ చేసేలా మార్పులు చేస్తాం. ఇది ఖాతాదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నాం’ అని తెలిపారు.