జియో, ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) టారిఫ్ రేట్లు పెంచడంతో బీఎస్ఎన్‌ఎల్‌లోకి పోర్ట్ అయ్యే యూజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో BSNL మరో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. 365 రోజుల వ్యాలిడిటీతో రూ.1,999 రీఛార్జ్ ప్లాన్‌పై రూ.100 తగ్గింపును అందిస్తున్నట్టు ప్రకటించింది. నవంబర్ 7 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎక్స్ వేదికగా వెల్లడించింది.