భారత ప్రభుత్వ టెలికాం సంస్థ ‘బిఎస్ఎన్ఎల్’ వినియోగదారులకు వారి బడ్జెట్‌కు అనుగుణంగా చాలా మంచి ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లు తక్కువ ధరకే లభిస్తాయి మరియు ఇతర టెలికాం కంపెనీలకు పోటీగా ‘బిఎస్ఎన్ఎల్’ ముందుంది.
అయితే తాజాగా BSNL ప్రస్తుతం తన వినియోగదారులకు 150 రోజుల ప్లాన్‌ను తీసుకువస్తోంది, కంపెనీ తన వినియోగదారులకు అందించిన మరో అదనపు సౌలభ్యం. ఈ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం…. ‘బిఎస్ఎన్ఎల్’ కొత్త రూ. 397 ప్లాన్ 150 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ మొదటి 30 రోజుల పాటు అపరిమిత కాలింగ్, 100 ఉచిత SMS మరియు రోజుకు 2GB డేటాతో వస్తుంది. మొత్తం 5 నెలల చెల్లుబాటుతో, ఈ ప్లాన్ చాలా మంది వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా, అనలిమిటెడ్ కాలింగ్ సౌకర్యం మొదటి నెల రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కూడా మీరు 2GB డేటాను రోజువారీగా పొందవచ్చు. 30 రోజుల తర్వాత డేటా లిమిట్ అయిపోతే, 40Kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ సెకండరీ సిమ్గా ఉపయోగించే వారికే కాకుండా, రోజువారీ డేటా అవసరం తక్కువగా ఉన్న వారికి కూడా మంచిది. మొదటి నెలలో రోజుకు 2GB డేటా పూర్తిగా సరిపోతుంది. అలాగే, అపరిమిత కాల్లతో పాటు ఉచిత SMS కూడా ఈ ప్లాన్‌లో ఒక భాగం, ఇది ఈ ప్లాన్‌ను ప్రత్యేకంగా చేస్తుంది. ఈ ప్లాన్‌లో BSNL 30 రోజుల పాటు ఉచిత కాలింగ్ మరియు SMS సౌకర్యాన్ని అందజేయడం వినియోగదారులకు ప్రధాన ప్రయోజనం. తదుపరి కాల్లకు అదనపు ఛార్జీలు వర్తించవచ్చు. BSNL సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకునే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపిక. ప్లాన్ ధర కూడా చాలా తక్కువ, ఇతర కంపెనీలతో పోలిస్తే ఈ ప్లాన్ చాలా ఆకర్షణీయంగా ఉంది.